PDPL: ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 26 నుంచి మే 10 వరకు ప్రజలు తమంతట తాము వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మూడు రోజుల నుంచి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం పాల్గొని స్వీయ గణనపై వివరిస్తున్నారు.