NRML: నిర్మల్ పట్టణంలోని శ్రీమాతా నిమిషాంబ దేవి ఆలయంలో రేపు మహాశాంతి అభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు,హోమాలు, అలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉత్సవాలు, భక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆలయ నిర్వాహకులు భక్తులను పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆలయ నిర్వహకులు కోరారు.