AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడలోని మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ జీజీహెచ్లో వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభపెట్టడంపై ప్రశ్నించారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రాజమండ్రి కోర్టు ఆవరణలో అనంతబాబును పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.