NRPT: మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీనివాసులు శనివారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, ఏవైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పుష్పలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పీఏసీఎస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.