MHBD: గంగారం నూతన ఎస్సైగా కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రవికుమార్ దంతాలపల్లి పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.