KMM: టీపీసీసీ సభ్యుడు, ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ సంతాప సభలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా జావేద్ చిత్రపటానికి నివాళులర్పించి జావేద్ చేసిన సేవలను స్మరించుకున్నారు. నగర అభివృద్ధిలో, పార్టీ బలోపేతంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.