KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో అంబేద్కర్ విగ్రహ కమిటీని ఏర్పాటు చేశారు. 1 వార్డు, 2 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మారేపల్లి అజయ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారితో పాటు కమిటీ సభ్యులను నియమించారు. అంబేద్కర్ ఆశయాలను గ్రామ స్థాయిలో కమిటీ కృషి చేస్తుందన్నారు.