JGL: మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. గంగపుత్రులు బండలింగాపూర్ నుంచి ఉత్సవ విగ్రహాలను ఆలయానికి తీసుకురావడంతో వేడుకలు మొదలవుతాయి. మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం, మే 3న రథోత్సవం, 4న చక్రతీర్థంతో వేడుకలు ముగియనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.