AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై అనంతపురం కలెక్టర్ ఆనంద్ స్పందించారు. ‘ప్యానిక్ లేకుండా చేసేందుకు అందరూ సహకరించాలి. స్టాక్ ఉండి పోయకపోతే చర్యలు తీసుకుంటాం. అత్యవసర వాహనాలను ఇబ్బంది పెట్టవద్దని చెప్పాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేస్తే ఊరుకునేది లేదు’ అంటూ హెచ్చరించారు.