MBNR: నవాబ్‌పేట మండలం కిషన్జూడ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు యాదయ్య జెండా ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.