మెదక్ జిల్లాలోని ఆవాస విద్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అనాథ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ, డ్రగ్స్ నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీవో షాజలోద్దీన్, ఎస్సై బాలరాజు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.