ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గుండి రహదారి దుస్థితి అద్వానంగా మారింది. దారి పొడవునా గుంతలు, తేలిన కంకర రాళ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం రాజంపేట రహదారి అని గ్రామస్థులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.