E.G: కడియం పేపర్ మిల్లోని కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం సమ్మెకు దిగారు. ఈ మేరకు వేతనాలు, సౌకర్యాల కోసం వారు నిరసన వ్యక్తం చేశారు. కొత్త వేతన విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. దీంతో మిల్ పనులు ప్రభావితమయ్యాయి. వెంటనే యాజమాన్యం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.