NRPT: దామరగిద్ద మండలంలో మిషన్ భగీరథ నీరు అందక 3 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు లేని కాలనీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కంసాన్ పల్లి, వత్తుగుండ్ల వద్ద పైపులైన్ పనులతో సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ట్యాంకర్లతో నీటిని అందిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.