HYD: సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు వెండి మోసం కేసులో నలుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ స్వచ్ఛత పత్రాలతో తక్కువ నాణ్యత గల లోహాన్ని ఇచ్చి వెండి వ్యాపారిని వంచించారు. ఆగ్రాకు చెందిన హృదేష్ కుమార్ ముఠా నాయకుడిగా తేలిందన్నారు. వీరి నుంచి 8.4 కిలోల వెండి, రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.