గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా టాక్సిక్ తెరకెక్కుతుంది. అయితే దర్శకురాలి పనితీరుపై యష్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘సున్నితమైన భావాలను గీతూ ఎంత బాగా చూపించారో, యాక్షన్ సీన్స్‌ను కూడా అంతే పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఒక లేడీ డైరెక్టర్ ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలరా? అని ఆమెతో కలిసి ప్రయాణించాకే నాకు అర్థమైంది’ అని చెప్పకొచ్చారు.