NGKL: బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో జిల్లా పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పశువైద్యాధికారి డా. జ్ఞానశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశువులకు టీకాలు, వ్యాధి నివారణపై రైతులకు కల్పిస్తున్న అవగాహనను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పశువైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.