NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు నల్గొండ చేరుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం హైదరాబాదు తిరుగుపయనమవుతారు. ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.