NLG: చందంపేటలో శ్రీ కనక దుర్గా అమ్మవారి ఆలయ భూమి పూజ కార్యక్రమం బుధవారం జరిగింది. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత, లక్ష్యసాధన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.