తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో దర్శకుడు రఘురామ్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో సహచరులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, రఘురామ్ 2004లో వచ్చిన ‘వరం’ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని మధురా నగర్లో ఉంటున్నాడు.