TPT: శక్తి టీమ్ మహిళా పోలీసులు బుధవారం కాలేజీ విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీనేజ్ సమస్యలు, సైబర్ నేరాలు, POCSO చట్టంపై విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియా మోసాలు, లోన్ యాప్‌లు, AI వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు 181, 1930, 112 గురించి అవగాహన కల్పించారు.