ప్రకాశం: సింగరాయకొండ జూనియర్ కాలేజీలో గురువారం కల్లకుంట గోపి మెమోరియల్ కార్క్ బాల్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిటీ నిర్వాహకులు బుధవారం తెలిపారు. మొదటి ప్రైజ్గా రూ.50,000, రెండవ బహుమతిగా రూ.30 వేలు, మూడో ప్రైజ్ రూ.20,000గా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీంలో 11 మంది సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఎవరు కిట్టు వాళ్లే తెచ్చుకోవాలని నిర్వాహణ కమిటీ తెలిపారు.