TG: హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30న రూ.15 వేల కోట్ల డీల్‌తో ఎల్ అండ్ టీ వాటాలను స్వాధీనం చేసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో మెట్రో బోర్డులో కీలక అధికారుల నియామకాన్ని చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఛైర్మన్‌గా సీఎస్ రామకృష్ణారావును నియమించింది.