SRD: జహీరాబాద్ ఎక్సైజ్ ఎస్సై రమేశ్ ఉన్నతాధికారుల నుంచి నగదు రివార్డు అందుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న వాహనాల తనిఖీల్లో గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 47 కిలోల అక్రమ డ్రగ్స్‌ను ఆయన పట్టుకున్నారు. ఈ ప్రతిభను గుర్తిస్తూ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిమ్ చేతుల మీదుగా రూ.25,000 నగదు బహుమతిని అందజేశారు. విధి నిర్వహణలో చూపిన చొరవను అధికారులు అభినందించారు.