BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పరుపుల తయారీ క్రమంలో విద్యుత్ షాక్కు గురై ఇస్మాయిల్(58) అనే వ్యక్తి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.