AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు నిన్న అర్ధరాత్రి బయలుదేరి వెళ్లారు. అయితే, ఆయన సరికొత్త స్టైలిష్, న్యూ లుక్‌లో కనిపించారు. సాధారణ తెల్ల చొక్కా కాకుండా జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్‌తో ఉన్న ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జగన్ ఈ స్టైలిష్ అవతార్‌ను వైసీపీ శ్రేణులు ‘మిస్టర్ కూల్’ అంటూ కొనియాడుతున్నారు.