NZB: కమ్మర్ పల్లిలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ చంద్ర బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో తమ గ్రామ పోలీస్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ నవీన్ చంద్ర బదిలీపై వెళ్తుండడంతో ఈ మేరకు నేడు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించారు.