టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఏప్రిల్ 29న ఉదయం 11:13 గంటలకు తిరుమల పుణ్యక్షేత్రంలో కావ్యా రెడ్డితో ఆయన పెళ్లి జరగనుంది. సనాతన ధర్మ సంప్రదాయబద్ధంగా సాగే ఈ కళ్యాణం అనంతరం, మే 1న హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.