TG: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ చేసిన విమర్శలు సరికాదని, ప్రజాప్రతినిధుల పట్ల కనీస గౌరవం ఉండాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మల్లు రవి స్పష్టం చేశారు.