KNR: శంకరపట్నం మండలం నల్ల వెంకయ్య పల్లి శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. గద్దపాకకు చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, వాహనాలను స్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.