GDWL: ఫీజు రీయింబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరుబాటలో ఆయన పాల్గొని విద్యార్థుల పక్షాన గళమెత్తారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 27న కలెక్టరేట్ల ముట్టడి చేపడతామన్నారు.