AP: రాష్ట్రంలో పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడటంతో బంకులు మూతపడుతున్నాయి. విజయవాడలో డీజిల్ కొరత వల్ల వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు. 100 బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కడప, పులివెందుల, గుంటూరు, పల్నాడు, తిరువూరు, కంచికచర్ల, నందిగామ, మైలవరంలోని బంకుల వద్ద డీజిల్ కొరతతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు. మైలవరం మండలంలో 7 బంకుల్లోనూ డీజిల్ కొరత ఏర్పడింది.