MDK: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ తీసుకువచ్చినట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నిజాంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలు కంది పద్మ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు.