AP: తిరుమల దశావతార-అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 27 వరకు జరిగే ఈ వేడుకల కోసం మండపాన్ని 2 టన్నుల పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్‌తో అలంకరించారు. గజ వాహనం, అష్టలక్ష్మి రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీనిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.