TG: సిరిసిల్లలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీమంత్రి KTR సందర్శించారు. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదన్నారు. మద్దతు ధర, బోనస్ భారం తప్పించుకోవడానికే జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను రాహుల్ అమలు చేయాలని కోరారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, రైస్ మిల్లుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతామని వెల్లడించారు.