KNR: చర్లభూత్కూరులోని ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న ఒడిశా మహిళ (23) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె.. భర్త పనికి వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.