SDPT: 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియను సిద్దిపేట కలెక్టర్ కె. హేమావతి ప్రారంభించారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను మే 10 వరకు ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను, http://se.census.gov.in పోర్టల్ ద్వారా మొబైల్, కంప్యూటర్లలో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.