‘కర’ ప్రమోషన్స్‌లో ధనుష్ తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ‘పొల్లాధవన్’ను గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తన బాడీ ఫిట్‌నెస్‌పై వచ్చిన విమర్శలను ఛాలెంజ్‌గా తీసుకుని, ఆ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ సాధించినట్లు తెలిపాడు. తన శరీరాకృతికి ప్రేక్షకుల నుంచి తొలిసారి ప్రశంసలు దక్కడం మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ క్షణాలు తనకెంతో స్పెషల్ అని అన్నాడు.