NZB: ముబారక్ నగర్ 18వ డివిజన్లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగ కన్నుల పండువగా జరిగింది. మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు. ఏటా ఏప్రిల్లో ఈ వేడుకలు నిర్వహించడం ఆచారమని, పాడిపంటలు బాగుండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు భక్తులు తెలిపారు.