BHNG: యాదగిరిగుట్టలో జనాభా లెక్కల స్వీయ గణన–2027 కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసానికి చేరుకున్న జేసీ భాస్కర్ రావు MLAతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను జనాభా లెక్కల స్వీయ గణన ప్రక్రియలో నమోదు చేశారు. ప్రతి కుటుంబం ఈ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.