MLG: ఎలుకల మందు సేవించిన ఇంటర్ విద్యార్థిని అక్షయ (17) చికిత్స పొందుతూ మృతి చెందింది. ములుగు మున్సిపాలిటీ బండారుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 22న ఘటన జరగగా 23న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించగా 27న రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.