SRD: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆందోల్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా, బాలల రక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏహెచ్టీయూ ఇన్చార్జ్ సీహెచ్ ప్రసాద్ రావు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్ టీజింగ్ అంశాలపై వివరించారు.