బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఖల్ నాయక్’ (1993) సీక్వెల్‌గా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ తెరకెక్కబోతోంది. అయితే, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుభాష్ ఘాయ్ (81 ఏళ్లు), ఈ సీక్వెల్‌కు తాను దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశాడు. దీంతో ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను ఏ దర్శకుడు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.