SDPT: గౌరారం వద్ద సంగారెడ్డి కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. BRS హయాంలో కెనాల్ ద్వారా సాగునీరందించి KCR రైతులకు భరోసా ఇచ్చారని సర్పంచ్ కనకరాజు గౌడ్ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, అధికారులు తక్షణమే స్పందించి కాలువకు నీరు వదలాలని డిమాండ్ చేశారు.