BDK: కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగించాలని అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు మేయర్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పిస్తూ ప్రాంగణాన్ని స్వచ్ఛంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మేయర్ ఆ ప్రదేశాన్ని త్వరలోనే శుభ్రపరచి సంరక్షిస్తామని హామీ ఇచ్చారు.