మెదక్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పల్లకి సేవ కన్నుల పండువగా సాగింది. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, రాగి అశోక్, కౌన్సిలర్లు రమణ, రాము, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.