TG: రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ తమ వివరాలను ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. డిజిటల్ విధానంలో ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే ఈ సౌకర్యం వల్ల గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.