మోహన్ లాల్, జీతూ జోసెఫ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘దృశ్యం 3’ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మే 21న సినిమా విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు నెల రోజులే సమయమున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కేవలం ఫ్రాంచైజీ ఇమేజ్‌పైనే ఆధారపడి ప్రమోషన్స్ ఊసే ఎత్తకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సస్పెన్స్ కోసమే ఈ మౌనమా? లేక ఇదో వినూత్న స్ట్రాటజీనా? అనేది మిస్టరీ.