నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) ప్రాంగణంలో ఓ అపరిచిత వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా, చికిత్స నిమిత్తం తరలించేలోపే మృతి చెందాడని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆదిలాబాద్‌కు చెందిన నగరాడే కాశీనాథ్ (50) అని తెలుస్తోందన్నారు. మృతుడిని ఇక్కడ ఎవరైనా గుర్తిస్తే తమను 87126 597714 గల నంబరుకు సంప్రదించాలని కోరారు.