SRCL: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో మద్యం విక్రయిస్తే పదివేల జరిమానా విధిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సర్పంచ్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే10 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించవద్దని అన్నారు. గ్రామంలో మద్యం దొరకడంతో చాలా మంది బానిసై కుటుంబాలను వీధిన పడేస్తున్నారన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.